అమెరికా ఎన్నికలపై ఇరాన్ హ్యాకర్ల దాడి!
- డాటా చౌర్యం, కీలక సమాచారం బహిర్గతం చేసేందుకు కుట్ర
- ఇజ్రాయెల్‌ేొహమాస్ యుద్ధంలో అమెరికా తీరుకు నిరసనగా ఇరాన్ ఎదురుదాడి
న్యూ ఢిల్లీ, ఆగస్టు 20: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకొనేందుకు ఇరాన్ హ్యాకర్లు యత్నిస్తున్నట్ల్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని ఎఫ్‌బీఐ అధికారులు సైతం విశ్వసిస్తున్నట్లు సమాచారం. ఇటీవల రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ప్రచారం కూడా హ్యాక్‌కు గురైందని తాము విశ్వసిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. తాజాగా కమలా హ్యారిస్ బృందం సమాచారాన్ని కూడా హ్యాక్ చేసేందుకు ఇరాన్ యత్నించినట్లు వార్తలు వస్తున్నాయి.
డాటా చౌర్యానికి యత్నం..
సోషల్ ఇంజినీరింగ్, ఇతర ప్రయత్నాల ద్వారా వ్యక్తులను ప్రభావితం చేయడంతో పాటు డాటా చౌర్యం, కీలక సమాచారం బహిర్గతం చేయడం వంటి చర్యలను ఇరాన్ హ్యాకర్లు మార్గంగా పెట్టున్నట్లు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి. హారిస్ బృందంలోని ముగ్గిరికి ఇలాంటి ఈ మెయిల్స్ రావడమే ఇందుకు ఉదాహరణ. దీనికి తోడు తమ సమాచారంపై హ్యాకర్లు దాడులు చేసినట్లు ఇప్పటికే డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు వెల్లడించాయి.
ఆరోపణలను ఖండించిన ఇరాన్..
ఐరాసలోని ఇరాన్ ప్రతినిధుల బృందం.. అమెరికా ఆరోపణలనుఖండించింది. ఇవి ఏ మాత్రం ఆధారాలు లేని ఆరోపణలు కొట్టిపారేసింది. అమెరికా ఎన్నికల్లో ఇరాన్ ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష జోక్యం చేసుకోదని ఆ దేశ ప్రతినిధులు స్పష్టం చేశారు. అయితే ఇజ్రాయెల్ యుద్ధంలో.. అమెరికా తీరుపై ఇరాన్ గుర్రుగా ఉన్నట్లు పలు అంతర్జాతీయ వార్తా ఛానళ్లలో ఇటీవల కథనాలు వెలువడిన విషయం తెలిసిందే.






