21 April, 2026 | 2:45 PM

తీర్పులిచ్చేది ఇలాగేనా?

21-08-2024 03:23 AM

కోల్‌కతా హైకోర్టు తీర్పుపై సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ, ఆగస్టు 20: సున్నితమైన అంశాల్లో తీర్పులు ఇచ్చేటప్పుడు న్యాయమూర్తులు చాలా జాగ్రత్తగా వ్యవహరిం చాలని సుప్రీంకోర్టు సూచించింది. గత ఏడాది కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పుపై అప్పీల్ విచారణ సందర్భంగా జస్టిస్ ఏఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం కింది కోర్టుల న్యాయమూర్తులకు పలు మార్గదర్శకాలు జారీచేసింది. కౌమార దశలో ఉన్న పిల్లలకు సంబంధించిన కేసుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

'ప్రేమ పేరుతో ఓ కౌమార బాలికను లొంగదీసుకొని ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డారన్న కేసులో కింది కోర్టు విధించిన శిక్షను కోల్‌కతా హైకోర్టు గత ఏడాది రద్దుచేసింది. 16 ఏండ్ల వయసుకు పైబడిన బాలికలు ఇష్టపూర్వకంగా లైంగిక చర్యలో పాల్గొంటే పురుషుడు నేరం చేసినట్టు కాదని తీర్పు చెప్పింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు రద్దుచేసి దోషికి శిక్షను ఖరారు చేసింది.