calender_icon.png 29 January, 2026 | 11:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూస్‌షాప్ యజమానిపై దాడి

27-09-2024 02:21:08 AM

ఇద్దరు యువకుల అరెస్టు

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 26: జూస్ సెంటర్ యజమానిపై దాడిచేసిన నిందితులను పోలీసలు అరెస్టు చేశారు. డీసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని పిల్లర్ నంబర్ 209 వద్ద ఉన్న రాయల్ జూస్‌సెంటర్‌లో బుధవారం అర్ధరాత్రి కస్టమర్ల మధ్య గొడవ జరిగింది. జూస్ సెంటర్ యజమాని వారిని సముదాయించే ప్రయత్నం చేయగావారు అతడిపై కత్తులతో దాడిచేశారు. ఈ ఘటనలో  8 మందికి గాయాలయ్యాయి. పోలీసులు  కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన అక్బర్, మహ్మద్ సర్వర్‌ను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.