calender_icon.png 29 January, 2026 | 11:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాచనపల్లి వాగులో అక్రమ ఇసుక రవాణా: ఐదుగురిపై కేసు నమోదు

29-01-2026 10:38:36 AM

​నూతనకల్, (విజయక్రాంతి): మండల పరిధిలోని మాచనపల్లి వాగులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు.విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం రాత్రి ఎస్సై నాగరాజు జరిపిన దాడుల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేశారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న బోలగాని మురళి, మద్దెల గణేష్, గుణగంటి శ్రీకాంత్, నిమ్మరబోయిన గణేష్, మరియు పిట్టల యాకయ్య అనే ఐదుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సహజ వనరులను దోచుకుంటే సహించేది లేదని, అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్సై నాగరాజు హెచ్చరించారు.