29-01-2026 01:10:58 AM
హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి) : తెలంగాణలో అన్నివర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తి, బాధలో ఉన్నారని, దానిని పట్టించుకునేందుకు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్‌కు తీరి క, ఉద్దేశం లేదని.. ఈ విషయంలో కేం ద్రంలోని బీజేపీకి సోయిలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించా రు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీల ను తుంగలో తొక్కిందని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధిచెప్పి బీఆర్‌ఎస్‌కు అండగా నిలబడాలని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ ఎన్నికల్లో అందరూ కలిసి సమష్టిగా పోరాడాలని కేటీఆర్ పిలపునిచ్చారు. కేవలం మున్సిపల్ ఎన్నికలు మాత్రమే కాకుండా రానున్న ప్రతి ఎన్నికల్లో నూ గులాబీ జెండాకు, కారు గుర్తుకు మద్దతు ఇచ్చి కేసీఆర్‌ను తిరిగి సీఎం చేయాలని కోరా రు. రెండు సంవత్సరాలుగా రాష్ర్టంలో కాం గ్రెస్, 12 ఏండ్లుగా దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేయకుండా టైం పాస్ చేస్తున్నాయని, అందుకే తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడిందన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తన అనుచరులతో కలిసి బీజేపీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరగా, పార్టీ కండువా కప్పి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు.
అడ్డగోలు విమర్శలు..
తెలివిలేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని, రేవంత్‌రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అందుకే కేసీఆర్, గత ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు చేస్తూ పరిపాలనను వదిలిపెట్టారని విమర్శించారు. రైతుబంధు ఎక్కడ పోయిందంటే లాగుల తొండలు ఇడుస్తా, ఆడబిడ్డలకు నూరు రోజు ల్లో 2,500 ఇస్తావంటివి అంటే పేగులు మెడ లో వేసుకుంటా, తులం బంగారమేదని గట్టిగా అడిగితే గుడ్లు పీకి గోటీలాడుతా అంటడని ఎద్దేవా చేశారు.
అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి వాటి అమలు ను పూర్తిగా విస్మరించారని, హామీల అమలు ను ప్రశ్నిస్తే బెదిరింపులు, కేసులు, అబద్ధాలకు దిగుతున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి పూర్తిగా అబద్ధాల మీద పరిపాలన చేయడం అలవాటు చేసుకున్నారని విమర్శించారు. కేవలం పరిపాలన చేతగాక అప్పుల పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పా రు.
అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్, కాగ్ ఏజెన్సీలు నామమాత్రపు అప్పు మాత్రమే ఉందని చెబుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అప్పుల సంఖ్య పెంచి తప్పుడు లెక్కలు చూపుతోందని కేటీఆర్ ఆరోపించారు. అయితే కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ప్రతి పైసా అప్పును సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకే వినియోగించిందని గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి పథకాలు, విద్యాలయాలు, ఆసుపత్రులు నిర్మించామని పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి రెండేళ్లలో తెచ్చిన రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్ర మం కూడా చేపట్టారా అని ప్రశ్నించారు. ఆ అప్పును ఎక్క డ ఖర్చు పెట్టారో ప్రజలకు చెప్పాలని డిమాం డ్ చేశారు. కనీసం ఒక్క ప్రాజెక్టైనా నిర్మించారా? సంక్షేమంపై ఖర్చు చేశారా? అని నిలదీ శారు. కేసీఆర్ అన్ని సగబెడితే.. రేవంత్‌రెడ్డి అన్ని ఎగబెట్టుడు, రాష్ట్రాన్ని పండబెట్టుడు తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు.
తాకట్లుంటే సర్దుకుని పోవాలే..
గత ఎన్నికలప్పుడు అక్కడక్కడ ఎమ్మెల్యేలపై కొంత కోపం ఉన్నందునే కొన్ని చోట్ల ఓడగొట్టారని, కానీ రాబోయే ఎన్నికల్లో ఏ నియో జకవర్గంలోనైనా కేసీఆర్ పంపించిన వారినే గెలిపించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ అన్ని చూసుకునే టిక్కెట్లు ఇస్తారని, గులాబీ కండు వా కప్పుకుని, కారు గుర్తుతో ఎవరు వచ్చినా గెలిపించాలని సూచించారు. పార్టీలో చిన్న, చిన్న తాక ట్లు ఉంటాయని, గులుగాలే, అలుగాలే కానీ అవన్నీ అర్రలోనే చేసుకోవాలని సూచించారు.
తిరిగి పార్టీలోకి వచ్చిన ఆరూరి రమేష్‌కు కేటీఆర్ హదయపూర్వక స్వాగతం పలికారు. రెండేళ్లలో బీజేపీ--, కాంగ్రెస్ వైఫల్యాలను చూసిన తర్వాత ప్రజలంతా కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఆరూరి రమేష్ గతంలో వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారని, దాదాపు లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచిన ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
రానున్న రోజు ల్లో కాంగ్రెస్ పాలనను చూసిన తర్వాత వర్ధన్నపేటలో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. గతంలో పార్టీ నాయకులతో పాటు ప్రస్తుతం ఉన్న ప్రతి ఒక్కరినీ కలుపుకొని సమష్టిగా ముందుకు వెళ్లి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించాలని రమేష్‌ను కోరారు.
కోవర్టులా కడియం: అరూరి రమేష్
చిన్న పొలగాడు తప్పిపోయి గాయిగాయి తిరిగి ఇంటికి వచ్చినంత సంబురంగా ఉందని బీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. అనేక మందిపై బురదజల్లి రాజకీయంగా ఎదగకుండా చేసిన మహానుభావుడు కడియం శ్రీహరి అని మండిపడ్డారు. ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డితో ములాఖత్ అయి, నా ఓటమితోపాటు వరంగల్ జిల్లాలో చాలా నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఓడిపోయేలా కోవర్టులాగా పనిచేసి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దయాకర్‌రావు మాట్లాడుతూ... సర్పంచ్ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గంలో అరూరి రమేష్ ఉంటే వన్‌సైడ్ గెలిచేవారమని, అయి నా ఇప్పటికీ చాలా సర్పంచు స్థానాలను గెలుచుకున్నామన్నారు. కష్టకాలంలో ఉన్న నాయ కులను, కార్యకర్తలను కాపాడుకోవాలని కేటీఆర్, హరీశ్‌రావుకు విజ్ఙప్తిచేశారు.
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. రాబో యే రోజుల్లో భారీమెజార్టీతో వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేను గెలిపించుకుని కేసీఆర్‌ను సీఎంను చేసుకునేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. అరూరి రమేష్ కొద్దీ అలకతో వెళ్లినా, మళ్లీ ఎప్పుడు వద్దామా అనే చూశారన్నారు. కడియం శ్రీహరి లాంటి వారి గూడ గుయ్యిమనేటట్టు వరంగల్ పరిధిలోని మున్సిపాలిటీలన్నీ గెలువాలన్నారు. మాజీమంత్రి సత్యవతి మాట్లాడుతూ.. వరంగల గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగురవేద్దామన్నారు.
కాంగ్రెస్ పాలన ఆగమాగం : హరీశ్‌రావు
బరువెక్కిన గుండె తేలికైనట్టు ప్రతిఒక్కరిలో కనిపిస్తుందని, తెలంగాణ రాష్ట్రం కూడా అదే మాదిరి కేసీఆర్ వైపు చూస్తుందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ అంటే నమ్మకం, భద్రత, భరోసా.. కానీ రెండేళ్లలో ప్రజల్లో అవిలేకుండా పోయాయన్నారు. కరోనా వచ్చినా, పెద్దనోట్ల రద్దు అయినా కేసీఆర్ హయాంలో రైతుబంధు మాత్రం ఆగలేదని గుర్తు చేశా రు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అంతా ఆగమాగం, సగం సగం.. దేనిపైనా నమ్మకం లేకుండా పోయిందని విమర్శించారు.
వానాకాలం పంటకు ఎరువులు దొరుకుతాయ నే నమ్మకంలేదని, ఫిబ్రవరి వచ్చినా ఇప్పటికీ రైతుబంధు రాలేదని, వస్తదో.. రాదో చెప్పే దిక్కేలేదని మండిపడ్డారు. పిల్లలు చదువుతున్న గురుకులాల నుంచి అర్ధరాత్రి ఫోన్ వస్తే ఏం జరిగిందోనని భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ‘నేను రాను బిడ్డో స ర్కార్ దవాఖానా’లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితి నెలకొందని తెలిపారు.
వర్ధన్నపేట, స్టేషన్‌ఘనపూర్‌లో కో అంటే ఎకరం కోటి రూపాయలుండే.. కానీ ఇప్పుడు బిడ్డ పెళ్లి అర ఎకరం అమ్ముదామంటే కొనేటోడే లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రమంతా ఆగమాగం.. జగన్నాధం అయింద ని విమర్శించారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ గెలవదని, బీజేపీకి స్థానం లేదనడానికి రమేష్ బీఆర్‌ఎస్‌లోకి రావడమే నిదర్శనమన్నారు. ఇంకో ఏడాది పోతే కాంగ్రెసోళ్లు కూడా లైన్ కడుతారని, కానీ ఈ కాంగ్రెస్ దొంగలను తీసుకునేది ఉండదన్నారు.