హైడ్రా పరిశీలించిన భూములను మళ్లీ కబ్జా చేయాలని యత్నం
22-08-2026 12:00 AM
హైడ్రా కమిషనర్‌కు ఆల్ కాలనీస్ ఫెడరేషన్ సభ్యుల ఫిర్యాదు
రాజేంద్రనగర్, ఆగస్టు 21 (విజయక్రాంతి): హైడ్రా పరిశీలించి భూములపై చర్యలు తీసుకునేందుకు జాబితా చేసిన స్థలాలను మళ్లీ కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆల్ కాలనీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోని పలువురు కాలనీల ప్రతినిధులు శుక్ర వారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. తిరుమల హిల్స్, వెంకటేశ్వర కాలనీల్లో పరిశీలించిన భూములను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
స్పందించిన కమిషనర్ సంబంధిత ప్రాంతాల్లో సీనియర్ ఇన్స్పెక్టర్లను పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశీలించిన భూముల్లో ప్రజల కోసం పార్కు అభివృద్ధికి సహకరించాలని ప్రతినిధులు కోరగా, పరిశీలిస్తామని రంగనాథ్ హామీ ఇచ్చారు.






