సమస్యల సుడిగుండంలో ఘట్‌కేసర్ సర్కిల్
- అభివృద్ధికి నోచని శివారు ప్రాంతం!
- ఘట్‌కేసర్ సర్కిల్‌కు ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయించాలి
- లేదా తిరిగి స్వతంత్ర మున్సిపాలిటీగా గుర్తించే విషయాన్ని పరిశీలించాలి
ఘట్‌కేసర్, ఆగస్టు 21 (విజయక్రాంతి) : నగరం శరవేగంగా విస్తరిస్తున్నప్పటికీ, అవుటర్ రింగ్ రోడ్డు ఇవతలి వైపు ఉన్న ఘట్ కే సర్ సర్కిల్ ప్రాంతం మాత్రం మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. తాగునీ రు, నిరంతర విద్యుత్ సరఫరా, సరైన రోడ్లు, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిధు ల కొరత సాకుతో పాలకులు, అధికారులు సమస్యలను గాలికి వదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విలీనం వికటించింది..
గతంలో ప్రత్యేక మున్సిపాలిటీగా ఉన్న ఘట్ కేసర్ ను ఔటర్ రింగ్ రోడ్డు ఇవతలి భాగంలో ఉందనే నెపంతో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ లో కలపడం పెద్ద చారిత్రాత్మక తప్పిదమని స్థానికులు మండిపడుతున్నారు.
పాలన దూరం
కార్పొరేషన్ కేంద్ర కార్యాలయాలు, అధికారులు దూరంగా ఉండటంతో చిన్న సమస్య పరిష్కారానికి కూడా ప్రజలు అల్లాడిపోవాల్సి వస్తోంది.
నిధుల కేటాయింపులో వివక్ష
కార్పొరేషన్కు వచ్చే ఆదాయం, నిధుల్లో ఎక్కువ భాగం కోర్ సిటీ లేదా కేంద్ర ప్రాం తాలకే సరిపోతుండటంతో, శివారులో ఉన్న ఘట్‌కేసర్ సర్కిల్కు మొండిచేయే మిగులుతోంది.
పన్నుల భారం.. సేవలు శూన్యం
కార్పొరేషన్లో విలీనం కావడం వల్ల ఆస్తి పన్నులు, ఇతర రుసుములు పెరిగాయే త ప్ప నాణ్యమైన సేవలు మాత్రం అందడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమస్యల వలయం ప్రధాన సవాళ్లు.. తాగునీటి ఎద్దడి
తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారుతోంది. పైప్లైన్ల విస్తరణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో కొన్ని కాలనీలకు నీరు చేరడం లేదు.
అధ్వానంగా రోడ్లు.. మృత్యుకూపాలుగా మారిన గుంతలు
అంతర్గత రహదారులు దారుణంగా తయారయ్యాయి. వర్షం వస్తే చాలు రోడ్లపై మోకాలు లోతు నీరు చేరి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
డ్రైనేజీ వ్యవస్థ వైఫల్యం
చాలా ప్రాంతాల్లో మురుగుకాల్వలు సరి గా లేక, వ్యర్థాలు రోడ్లపైకే ప్రవహిస్తున్నాయి. దీంతో దుర్గంధం, దోమల తాకిడి పెరిగి అం టువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
విద్యుత్ కోతలు లో వోల్టేజీ
వేగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లు ఏ ర్పాటు చేయకపోవడంతో లో-వోల్టేజీ సమస్యలు నిత్యకృత్యమయ్యాయి.
తక్షణ చర్యలు అవసరం
ఔటర్ పరిధిలోని ప్రాధాన్యతను గు ర్తిం చి అధికారులు వెంటనే స్పందించాలని, ఘ ట్కేసర్ సర్కిల్కు ప్రత్యేక అభివృ ద్ధి నిధులు కేటాయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేదా పరిపాలనా సౌలభ్యం కోసం ఘట్ కేసర్ ను తిరిగి స్వతంత్ర మున్సిపాలిటీగా గుర్తించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరుతున్నారు. కార్పొరేషన్లో కలిపితే ఘట్కేసర్ రూపురేఖలు మారతాయని ఆశపడ్డాం. కానీ పన్నులు కట్టడానికే పరిమితమయ్యాం. ప్రత్యేక మున్సిపాలిటీగా ఉన్నప్పుడే నిధులు నేరుగా వచ్చి పనులు త్వరగా జరిగేవి.
కూసపాటి పద్మారావు, స్థానిక నివాసి
* మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనమైన తర్వాత సమస్యల విషయమై చెప్పుకునేందుకు ప్రజాప్రతినిధులు లేక చాలా బాధపడుతున్నాం. సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. ప్రభుత్వం వెంటనే అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలి, ప్రజల సమస్యలను పరిష్కరించాలి.
పర్నాటి ఆనంద్, స్థానిక నివాసి






