పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి
నిర్మల్, ఆగస్టు 21 (విజయక్రాంతి): పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని మంత్రి పదవి నుండి తక్షణమే బర్తరఫ్ చేయాలని బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో నిరసన తెలిపారు. మంత్రి పొంగులేటికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించిన బిజెపి నాయకులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు జాయింట్ కలెక్టర్ కిషోర్ గారికి మెమొరాండం సమర్పించారు.
ఈ సందర్భంగా రావుల రామనాథ్ మాట్లాడుతూ 22A పేరుతో పేద ప్రజల భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని నిషేధిత జాబితాలో చేర్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. పొంగులేటికి సంబంధించిన అవినీతి ఆధారాలతో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు అసెంబ్లి వద్దకు వస్తే మంత్రి రాకుండా పారిపోవడం సిగ్గుచేటని తెలిపారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లాలో 22A పేరుతో నిషేధిత జాబితాలో చేర్చిన భూముల వివరాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తక్కల రమణ రెడ్డి, ముత్యం రెడ్డి, మెడిసెమ్మ రాజు, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు,పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






