6 June, 2026 | 10:13 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

వడ్డేపల్లి మున్సిపల్ కమిషనర్‌పై దాడికి యత్నం

10-04-2026 12:09 AM

శాంతినగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన కమిషనర్ 

అలంపూర్, ఏప్రిల్ 9:గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపల్ కమీషనర్ సొంటి రాజయ్య పై మాజీ జెడ్పిటిసి వడ్డేపల్లి శ్రీనివాసులు అనుచరవర్గం దాడికి యత్నించారని వారి నుంచి నా ప్రాణాలకు ముప్పు ఉంది. నా ప్రాణాలకు ఏమి జరిగినా వడ్డేపల్లి శ్రీనివాసులు అనుచర వర్గమే పూర్తి బాధ్యత అని మున్సిపల్ కమీషనర్ సొంటి రాజయ్య మీడియా ముందు వెల్లడించారు.ఈ మేరకు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఘటనపై గురువారం శాంతినగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు మున్సిపల్ కమీషనర్ తెలిపారు.

మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికపై శ్రీనివాసులు 50 మందితో కలిసి మున్సిపల్ మున్సిపల్ ఛాంబర్ లోకి దూసుకవచ్చి దుర్భాషలాడుతూ దాడికి యత్నించారని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో విధులు నిర్వహించడానికి వచ్చానని తనకు ఎవరు శత్రువులు లేరని దాన్ని వారి వ్యక్తిగతంగా తీసుకున్నారని మున్సిపల్ కమిషనర్ వాపోయారు.ఈరోజు ఆఫీసులో తనపై జరిగిన ఘటనపై మీడియా ముందు తన కమిషనర్ రాజయ్య ఆవేదనను వెలిబుచ్చారు .