6 June, 2026 | 11:29 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి శాశ్వత తొలగింపు

10-04-2026 12:08 AM

అలంపూర్ ఏప్రిల్ 9:అయిజ మండలం ఎక్లాస్ పూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిగా అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసిన బోయ రంగన్న గత నెల 13న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుడితో బిల్లులు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీకి పట్టుబడ్డారు.

పంచాయతీ కార్యదర్శి రంగన్న పై నేరారోపణ రుజువు కావడంతో శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం ఆదేశాలు జారీ చేశారు.జిల్లాలోని అధికార యంత్రాంగం నిబద్ధతతో, పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించాలని విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై, అవినీతికి పాల్పడే వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు.