17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడికి యత్నం

01-11-2025 12:00 AM

-చాక్లెట్ల ఆశచూపి చిదిమేసే ప్రయత్నం

-ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వలస కూలీల అరెస్టు

-యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో ఘటన

చౌటుప్పల్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సి పాలిటీ పరిధిలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. చాక్లెట్ల ఆశచూపి నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడికి యత్నించిన ఇద్దరు ఉత్తర ప్రదేశ్ కూలీలను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చౌటుప్పల్‌లో ఉండే ఒక కంపెనీలో ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఇద్దరు కూలీలు పనిచేస్తున్నారు. చిన్నారి తండ్రి కూడా అదే కంపెనీలో పని చేస్తున్నాడు. రోజులాగే శుక్రవారం కూడా చిన్నారి తండ్రి కంపెనీకి వెళ్లాడు.

తల్లి ఆరుబయట దుస్తులు శుభ్రం చేస్తూ ఉండగా.. ఇంట్లో ఉన్న చిన్నారికి చాక్లెట్ కొనిస్తానని చెప్పి లైంగిక దాడికి యత్నించారు. గమనించిన చిన్నారి తల్లి  కేకలు వేయడంతో స్థానికులు గమనించి వాళ్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నారిని చికిత్స నిమి త్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. కాగా నిందితులు గంజాయి మత్తులో ఉన్నట్టు తెలుస్తున్నది.