17 April, 2026 | 4:23 PM

ముగిసిన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

01-11-2025 12:00 AM

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 31: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు  ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. వారోత్సవాలు శుక్రవారానికి ముగియడంతో విద్యార్థులతో ఇబ్రహీంపట్నం బస్ డిపో నుండి ఓం చౌరస్తా వరకు ‘రన్ ఫర్ యూనిటీ 2కే రన్‘ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహేశ్వరం జోన్ డీసీపీ సునీతరెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసిపి రాజు పాల్గొన్నారు.

అమరులైన పోలీస్ సిబ్బందికి, కుటుంబ సభ్యులకు ఇదే మా వందనమంటూ.. పోలీసులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని, ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరులకు జోహార్ జోహార్ అంటూ జేజేలు పలికారు.    డివిజన్ పరిధిలోనీ సిఐ లు, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.