28-10-2025 12:48:24 AM
-నేరస్థుడికి పదేళ్ల జైలు, 50 వేల జరిమానా
-నల్లగొండ పోక్సో కోర్టు తీర్పు
నల్లగొండ క్రైం, అక్టోబర్ 27 : బాలికపై లైంగికదాడికి యత్నించిన నేరస్థుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. తిప్పర్తి మండలం కేసరాజుపల్లి గ్రామానికి చెందిన గొర్ల సైదులు ఎనిమిదేళ్ల బాలికపై లైంగికదాడికి యత్నించాడు. ఈ ఘటనపై తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా నేరం రుజువుకావడంతో 10 సంవత్సరాల జైలు, రూ.50 వేల జరిమానా విధి స్తూ పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం అందించాలని తీర్పులో పేర్కొన్నది.