28-10-2025 12:49:21 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ ౨౭ (విజయక్రాంతి): మద్యం దుకాణాల కేటాయిం పుకు సంబంధించి నిర్వహించిన లక్కీ డ్రా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో జిల్లా ఎక్సైజ్ అధికారి జ్యోతి కిరణ్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అదనపు కలెక్టర్ డేవిడ్ ల ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. మొత్తం 32 మద్యం దుకాణాలు కాగా దరఖాస్తులు తక్కువ వచ్చాయని 7 దుకాణాలు వాయిదా వేయగా 25 దుకాణాలకు లక్కీ డ్రా నిర్వహించారు.
దీనికోసం 632 మంది దరఖాస్తుదా రులు పాల్గొన్నారు. లక్కీ డ్రా లో నేపథ్యంలో కలెక్టరేట్ లో పోలీసులు స్థానిక సీఐ బాలాజీ వరప్రసాద్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లక్కీ డ్రా నిష్పక్షపాతంగా సాగిందని, నిబంధనలు పాటిస్తూ దుకాణాలు నడుపుకోవాలని సూచించారు.లక్కీ దక్కించుకున్నవారు ఆనం దం వ్యక్తపరచగా లక్కీ రానివారు నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోయారు.జిల్లాలోని 25 దుకాణాలకు లక్కీ డ్రా లు నిర్వహించగా విజేతలుగా నిలిచిన వారి వివరాలు.ఆసిఫాబాద్ 1- వసంతరావు,ఆసిఫాబాద్ 2 - గాజుల అశోక్, ఆసిఫాబాద్ 3- తోట వినోద్, ఆసిఫాబాద్ 4- తోగరి జగన్,ఆసిఫాబాద్ 5- పల్లె సంతోష్ కుమార్,ఆసిఫాబాద్ 6- బుర్ర రజిత,
వాంకిడి 1- మల్యాల సుదర్శన్, వాంకిడి 2- గాలె సంతోష్, గంగాపూర్ (రెబ్బెన)- రుకుం ప్రహ్లాద్,గోయగాం(తిర్యాని)- బోనగిరి నరేష్,గోయగం (కెరమేరి)- రంగు రవీందర్ గౌడ్,కాగజ్ నగర్( రైల్వే గేట్)- ముద్దసాని అశ్విని,కాగజ్ నగర్( బట్టుపల్లి రోడ్డు)- సుంకర్ లక్ష్మణ్ కుమార్,కాగజ్ నగర్( పెట్రోల్ పంపు)- శ్రీకాంత్ రెడ్డి,కాగజ్ నగర్( రాజీవ్ చౌక్)- దాసరి వైకుంఠం,కాగజ్ నగర్(తీరందాజ్)- రాచర్ల వైకుంఠం,సిర్పూర్ టి- మౌల్కర్ విఠల్,ఇస్గాం- బండి నికిత,కౌటాల 1- కొమరం నగేష్,కౌటాల 2- రంగు ఉపేంద్ర చారి,బెజ్జూర్- పల్లె సంపత్ కుమార్,పెంచికలపేట- లేండుగురే విగ్నేష్,దహేగాం- బోయిరే బావాజీ,గూడెం- రామగొని మల్లికార్జున్ గౌడ్,చింతలమానపెళ్లి- బొట్లకుంట మల్లేష్.
దరఖాస్తుదారుల సమక్షంలో...
మంచిర్యాల, అక్టోబర్ ౨౭ (విజయక్రాం తి): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీరాంపూర్ పివిఆర్ గార్డెన్స్‌లో సోమవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా ఎక్సైజ్ అధికారి నందగోపాల్ ల ఆధ్వర్యంలో నూతన మద్యం పాలసీ విధానం ప్రకారం లక్కీ డ్రా పద్ధతిన మద్యం దుకాణా లు కేటాయించారు. జిల్లాలో 73 మద్యం దుకాణాలకు 1,712 దరఖాస్తులు రాగా లక్కీ డ్రా పద్ధతిన దుకాణాలను కేటాయించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ నియమ, నిబంధనలను అనుసరిస్తూ ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ఏర్పాట్లు చేశామని, దుకాణా ల వారీగా దాఖలైన దరఖాస్తులకు సంబంధించిన దరఖాస్తుదారుల సమక్షంలో లక్కీ డ్రా తీస్తూ మద్యం దుకాణాల కేటాయింపు చేశామన్నారు. లక్కీ డ్రా కోసం వినియోగించిన టోకెన్ లను అందరికీ చూపిస్తూ, పారద ర్శకంగా ప్రక్రియ ప్రారంభం నుంచి చివరి వరకు ఫొటో, వీడియో చిత్రీకరీస్తూ, టోకెన్ కలిగి వారిని మాత్రమే లోపలికి అనుమతించామన్నారు.
దుకాణం పొందిన వారు నిబం ధనలను అనుసరిస్తూ, లైసెన్స్ ఫీజు రూపే ణా నిర్ణీత రుసుము చెల్లించేందుకు వీలుగా వేదిక వద్దనే అవసరమైన కౌంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎసిపి ప్రకాష్ తో పాటు ఎక్సైజ్ సీఐలు గురువయ్య, ఇంద్రప్రసాద్, హరి, సమ్మయ్య, కందుల తిరుపతి, సంబంధిత అధికారులు, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌లో సాఫీగా...
ఆదిలాబాద్, అక్టోబర్ ౨౭ (విజయక్రాం తి): ఆదిలాబాద్ జిల్లాలోని మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించిన లక్కీ డ్రా ద్వారా చేపట్టిన ప్రక్రియ సాఫీగా, పారదర్శకంగా కొనసాగింది. సోమవారం స్థానిక రత్న గార్డెన్లో జిల్లా కలెక్టర్ రాజార్షి షా పర్యవేక్షణలో ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రక్రియ ను పూర్తి చేశారు. ఎక్సైజ్ పాలసీ (2025 27) ప్రకారం మొత్తం 40 మద్యం షాపుల కేటాయింపులో 34 షాపులు లక్కీ డ్రా ద్వారా కేటాయించారు.
మరో 6 మద్యం షాపులకు 10 కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన నేపధ్యంలో డ్రా నిర్వహించకుండా, వాటి కోసం మళ్లీ రీ-టెండర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి షాపుకు సంబంధించిన దరఖాస్తుల ఆధారంగా టోకెన్ నంబర్లు కేటాయించి, దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ స్వయంగా లక్కీ డ్రా నిర్వహించారు. లక్కీ డ్రాలో ఎంపికైన వారికి లైసెన్స్ ఫీజు చెల్లింపునకు అవసరమైన సదుపాయాలను వేదికపైనే కల్పించారు.
లక్కీ డ్రా ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా సాగేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భద్రతా పరమైన దృష్ట్యా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కే.రఘు రామ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ, ఎక్సైజ్ సీఐ విజేందర్ పాల్గొన్నారు.
పారదర్శకంగా ప్రక్రియ..
నిర్మల్, అక్టోబర్ ౨౭ (విజయక్రాం తి): జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపుకు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొని లక్కీ డ్రా ద్వారా 47 మద్యం షాపులను కేటాయించారు. మొత్తం 991 దరఖాస్తులు అందిన నేపధ్యంలో, ఒక్కో షాపుకు సంబంధించిన దరఖాస్తుల ఆధారంగా టోకెన్ నంబర్లు కేటాయించి, దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ స్వయంగా డ్రా తీశారు.
డ్రా ప్రారంభం నుండి ముగింపు వరకు ఫోటో, వీడియో చిత్రీకరణ జరిపి, పూర్తి పారదర్శకతతో ప్రక్రియ పూర్తి చేశారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా డ్రా కొనసా గేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పా ట్లు చేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో సాగింది.
లక్కీ డ్రాలో ఎంపికైన వారికి నిర్ణీత లైసెన్స్ ఫీజు చెల్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు వేదికపైనే కల్పించారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఎక్సైజ్ అధికారి అబ్దుల్ రజా క్, ఎక్సైజ్ సిబ్బంది, మద్యం దుకాణాల దరఖాస్తుదారులు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.