దుస్సాహసానికి పాల్పడితే తీవ్ర పరిణామాలు
- ఇరాన్ యుద్ధాన్ని ఆసరాగా చేసుకోవద్దు
- పాకిస్థాన్‌ను హెచ్చరించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్
తిరువనంతపురం, ఏప్రిల్ 2: మధ్యప్రాచ్యంలోని అశాంతిని అవకాశంగా తీసుకుని పాకిస్థాన్ అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తే, భారతదేశం ప్రతిస్పందన ‘నిర్ణయా త్మకంగా’ ఉంటుందని రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇరాన్ యుద్ధం నీడలో ఎలాంటి ‘దుస్సాహసానికి’ పాల్పడవద్దని గురువారం హెచ్చరించారు. 2025 పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ మొదటి వార్షికోత్సవానికి కొన్ని రోజుల ముందు ఈ హెచ్చరిక చేశారు.
ఎన్నికలు జరగనున్న కేరళలో గురువారం జరిగిన సైనిక్ సమ్మాన్ సమ్మేళనంలో మాట్లాడుతూ, మధ్యప్రాచ్యంలోని అ శాంతిని అవకాశంగా తీసుకుని పాకిస్థాన్ అలజడి సృష్టించ డానికి ప్రయత్నిస్తే, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇంకా ఆపరేషన్ సింధూర్ ముగియలేదని గుర్తించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత బలగాలు కేవలం 22 నిమిషాల్లోనే పాకిస్థాన్‌ను ఎలా మోకరింపజేశాయో రాజ్‌నాథ్‌సింగ్ గుర్తు చేశారు.




