calender_icon.png 6 May, 2025 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎప్‌సెట్‌కు 93.86 శాతం మంది హాజరు

03-05-2025 11:49:49 PM

హైదరాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహిస్తోన్న టీజీ ఎప్‌సెట్ పరీక్షకు శనివారం 93.86 శాతం మంది హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో అభ్యర్థులకు రెండు సెషన్లలో పరీక్షలు జరిగాయి. ఉదయం సెషన్‌కు 93.81 శాతం, మధ్యాహ్నం సెషన్‌కు 93.86 శాతం మంది హాజరయ్యారు. తొలి సెషన్‌లో 34,607 మంది హాజరవ్వగా.. 2, 285 మంది గైర్హాజరయ్యారు. ఇక రెండో సెషన్‌లో 34,620 మంది పరీక్ష రాయగా.. 2,265 మంది డుమ్మా కొట్టారు. నేటితో ఎప్‌సెట్ పరీక్షలు ముగియనున్నాయి.