calender_icon.png 6 May, 2025 | 11:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన కోసరాజు లక్ష్మణ్

03-05-2025 11:40:52 PM

హైదరాబాద్: బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సలహాదారునిగా నూతనంగా నియమితులైన కోసరాజు లక్ష్మణ్, బ్యాట్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ మీడియా కో ఆర్డినేటర్ వెంకట రమణా రెడ్డిలు శనివారం రాష్ట్ర ఐటి,  పరిశ్రమల శాఖ మంత్రి, తెలంగాణ బ్యాట్ అధ్యక్షులు దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.

శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బ్యాట్మింటన్  క్రీడాభివృద్ధికి మరింత కృషి చేస్తామని,  క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. యంగ్ ఇండియా స్పోరట్స్ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్ అకాడమీలను క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధితో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీకి తన వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో బ్యాట్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఈవెంట్స్ అండ్ ప్రోటోకాల్ యువిఎన్ బాబు తదితరులు ఉన్నారు.