04-05-2025 12:22:03 AM
భార్య మృతి
చికిత్స పొందుతున్న భర్త
రాజేంద్రనగర్, మే 3: ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపానికి గురైన దంపతు లు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన ఆలస్యంగా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
ఏదులాబాదుకు చెందిన రమేశ్ చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్ బాలనగర్‌లో నివాసం ఉంటున్నారు. స్థానికంగా ఓ షాప్ నిర్వహిస్తున్నడు. ఇతనికి రాజేశ్వరి(38), ఓ కూతురు ఉం ది. కొంతకాలంగా రమేష్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ దివాలా తీశాడు. దీంతో భార్య రాజేశ్వరి మతిస్థిమితం కోల్పోయి పిచ్చి ఆసుపత్రిలో చేరింది.
అనంతరం ఆమె ఆరో గ్యం కుదుటపడింది. దిక్కుతోచని స్థితి లో ఉన్న వారికి మియాపూర్ లో ఉం టున్న రమేష్ సోదరి అండగా నిలిచిం ది. ఆమెకు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రబోడలో ఇల్లు ఉంది. నెల రోజుల క్రితం రమేష్, రాజేశ్వరిని ఆ ఇంట్లో ఉంచి రెండు నెలలకు సరిపడే రేషన్ సమకూర్చి మంచిగా ఉండాలని సూచించింది.
ఇదిలా ఉంటే ఏప్రిల్ 30న రాత్రి రమేష్, రాజేశ్వరి గడ్డి మం దు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. అర్ధరాత్రి రాజేశ్వరికి వాంతులు, విరోచనాలై అక్కడే మృతి చెందింది.రమేష్ కూడా వాంతులు, విరోచనాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించ గా చికిత్స పొందుతున్నాడు. కు టుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.