టెట్‌కు రెండో రోజు 79.62% హాజరు
22-05-2024 01:14 AM
హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): టెట్ పేపర్ (మ్యాథ్స్ అండ్ సైన్స్) రెండో రోజు మంగళవారం ప్రశాంతంగా జరిగిందని అధికారులు తెలిపారు. మొదటి సెషన్‌లో 61 సెంటర్లలో 10,674 (76.77 శాతం) మంది హాజరుకాగా, 3,230 మంది గైర్హాజరయ్యారు. రెండో సెషన్‌లో 67 సెంటర్లలో 12,730 (82.19 శాతం) మంది అభ్యర్థులు పరీక్ష రాయగా, 2,758 మంది గైర్హాజరయ్యారు. రెండు సెషన్లలో మొత్తంగా 23,404 (79.62 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. బుధవారం కూడా టెట్ పేపర్ పరీక్షే నిర్వహించనున్నారు.






