29-12-2025 09:10:18 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్సిటీ సామాజిక శ్రేయస్సు కోసం స్వచ్ఛంద సంస్థల పరస్పర సహకార సంబంధాలతో ముందుకు సాగుతుందని యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ వి. విజయ్ కుమార్ అన్నారు. ఘట్ కేసర్ సర్కిల్ పరిధి వెంకటాపూర్ అనురాగ్ యూనివర్సిటీతో స్ఫూర్తి ఆర్గనైజేషన్ పరస్పర అవగాహన ఒప్పంద పత్రాలను ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ళ యాదయ్య, డీన్ డాక్టర్ వి. విజయ్ కుమార్ లు సోమవారం మార్చకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న శాస్త్రీయ ఆలోచనతో సామాజిక మార్పు కోసం మనం కార్యక్రమం ద్వారా చేపడుతున్న కార్యక్రమాలలో అనురాగ్ యూనివర్సిటీ భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు. స్వఛ్ఛంద సంస్థలు సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాలని సూచించారు.