calender_icon.png 29 December, 2025 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి పదవి ఇస్తే... జిల్లాలోని నిరుపేదలకు మరింత మేలు

29-12-2025 09:22:34 PM

-  రామగిరి రామాలయం నుండి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర

- ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు పెరిక వెంకటేశ్వర్లు

మునుగోడు,(విజయక్రాంతి): మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే జిల్లాలోని నిరుపేదలకు మరింత మేలు జరుగుతుందని ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు పెరిక వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి  మంత్రి పదవి దక్కాలని ఆకాంక్షిస్తూ, జనవరి 9వ తేదీన నల్లగొండ పట్టణంలోని రామగిరి దేవాలయం నుంచి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ననుమూలల నుండి అభిమానులు కార్యకర్తలు తరలివచ్చి పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు.

ప్రజల మనోభిలాషను దేవునికి విన్నవిస్తూ, ప్రజాసంక్షేమం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం విశేషామన్నారు. రాజగోపాల్ రెడ్డి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా, ముఖ్యంగా పేద ప్రజల విద్యా, ఆరోగ్య అవసరాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపే వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయనకు మంత్రి పదవి లభిస్తే జిల్లాలోని నిరుపేదలకు మరింత మేలు చేకూరుతుందని, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి బాలకృష్ణ, వంగూరి ప్రశాంత్, బద్దెల వెంకన్న ఉన్నారు.