calender_icon.png 29 December, 2025 | 11:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు దుర్గం తిరుపతికి డాక్టరేట్

29-12-2025 09:27:23 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాటనీ సీనియర్ అధ్యాపకులు దుర్గం తిరుపతి పిహెచ్డి డాక్టరేట్ అందుకున్నారు. మణిపూర్ లోని "ఏషియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ"లో తిరుపతి పిహెచ్డి చేశారు. ఆ యూనివర్సిటీలోని డాక్టర్ శోభిత్ కుమార్ శ్రీవాత్సవ్ గైడ్ షిప్ లో "మెడిసినల్ ప్లాంట్స్ ఫర్ యాంటీ వైరల్ పొటెన్షియల్ ఫైండింగ్ ఫ్రమ్ ఇండియన్ కాంటాక్ట్స్" అనే అంశంపై పరిశోధన చేశారు. పరిశోధన పూర్తి కాగా సోమవారం యూనివర్సిటీలో ఓపెన్ వైవా నిర్వహించారు.

తిరుపతి చేసిన పరిశోధనా అంశాలు ఎగ్జామినర్లను సంతృప్తి పరచడంతో ఆయనకు పీహెచ్డీ డాక్టరేట్ ప్రకటించారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం చిట్యాల గ్రామానికి చెందిన దుర్గం తిరుపతి 2008లో తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి బాటనీ సబ్జెక్టులో పీజీ పట్టా పొందారు. అనంతరం అదే ఏడాది డిగ్రీ ఒప్పంద అధ్యాపకుడిగా చేరి వివిధ కళాశాలల్లో పనిచేసిన ఆయన ప్రస్తుతం బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు.

మణిపూర్ లోని ఏషియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో పిహెచ్డి సీటు పొంది పరిశోధన పూర్తి చేశారు. పిహెచ్డి వంటి ఉన్నత డిగ్రీని పొందడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు, బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్, వైస్ ప్రిన్సిపాల్ మేడ తిరుపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, కళాశాల సూపరిండెంట్ భోదనేతర సిబ్బంది, విద్యార్థులు, హర్షం వ్యక్తం చేశారు.