29-12-2025 09:41:59 PM
పరిశీలించిన ఉప్పల్ జోనల్ కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాధిక గుప్తా
మేడిపల్లి,(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఆదేశానుసారం 29 డిసెంబర్ 2025 నుండి 31 జనవరి 2026 వరకు జరిగే ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం లో భాగముగా సోమవారం మొదటి రోజు కార్యక్రమంలో ఉప్పల్ జోనల్ కమీషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, బోడుప్పల్ డిప్యూటీ కమీషనర్ ఎ. శైలజా తో కలిసి బోడుప్పల్ సర్కిల్ లో పారిశుద్ధ్య పనులను పరిశీలించడం జరిగినది. ఈ సందర్భంగా జోనల్ కమీషనర్ మాట్లడుతూ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం రోజు వారి ప్రణాళిక అనుసరించి చేపట్టి విజయవంతం చేయాలన్నారు. అనంతరం జరుగుచున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.