29-12-2025 09:04:17 PM
భారతీయ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కోలా రామకృష్ణ
హనుమకొండ టౌన్/వరంగల్,(విజయక్రాంతి): వరంగల్ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ కు, మార్కెట్ వెళ్లే దారిలో కొత్త కరెంటు దీపాలను ఏర్పాటు చేయవలసిందిగా భారతీయ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కోల రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ... వరంగల్ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్కు, మార్కెట్ కు వెళ్లే దారిలో రాత్రి వేళలో తగినంత వెలుతురు లేకపోవడం వల్ల పాదాచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
రాత్రి సమయంలో బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ పరిధిలోకి రావాలంటే ప్రమాదంకరంగా మారిందని అన్నారు. స్ట్రీట్ లైట్లు లేకపోవడం వల్ల చీకటి ఎక్కువగా ఉండి దొంగతనాలు, ఇతర అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయని, ప్రయాణించే ప్రజలను దౌర్జన్యంగా వెంబడించి వారిపై దాడి చేయడం డబ్బులు, జేబులో ఏముంటే అవి లాక్కోవడం వలన భయభ్రాంతులతో గురవుతున్నారని అన్నారు. కాబట్టి స్ట్రీట్ లైట్స్ అమలు చేయాలని భారతీయ హిందూ పరిషత్ తరపున కమిషనర్ ను కోరారు.