8 April, 2026 | 12:07 PM

చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం భూములు కౌలుకి వేలంపాట

08-04-2026 10:04 AM

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం భూములు కౌలుకు ఇచ్చుటకు వేలంపాట నిర్వహిస్తున్నామని దేవస్థానం చైర్మన్, ఈవో పేర్కొన్నారు. బుధవారం నాడు జరిగే వేలం పాటలో శివాలయం నందు దేవస్థానానికి ఉన్న కేసిరెడ్డిపల్లి గ్రామంలో 27 ఎకరాల భూమికి రెండు సంవత్సరాల కాల వ్యవధికి గాను ముందుగా 10000 డిపాజిట్ చేయవలసి ఉంటుందని, ఎర్రుపాలెం లోని నాలుగెకరాల భూమికి ఐదువేల రూపాయలు డిపాజిట్ చేయవలసి ఉంటుందని, ఆసక్తి ఉన్నవారు బుధవారం నాడు శివాలయం నందు జరిగే వేలంపాటలో పాల్గొనాలని దేవస్థానం చైర్మన్ మగినం జయశ్రీ, దేవస్థానం ఈవో పేర్కొన్నారు.