6 March, 2026 | 3:09 AM

ఏసీబీకి చిక్కిన ఆడిట్ సెక్షన్ ఆఫీసర్

06-03-2026 01:39 AM
  1. రూ.35 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సంతోష్‌కుమార్

సికింద్రాబాద్ జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

సికింద్రాబాద్ మార్చ్ 5 (విజయక్రాంతి): సికింద్రాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన దాడిలో ఆడిట్ అధికారి సంతోష్ లంచం తీసుకుం టూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. రూ.35 వేల లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో పనిచే సే ఆంజనేయులు తన రిటైర్మెంట్ తర్వాత రావాల్సిన బకాయి డబ్బుల విషయంగా గత ఆరు నెలలుగా కార్యాలయానికి తిరుగుతున్నట్లు తెలిపారు.

అయితే తన పని చేయా లంటే రూ.40 వేల లంచం ఇవ్వాలని ఆడిట్ అధికారి సంతోష్ డిమాండ్ చేసినట్లు ఆంజనేయులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు ముందస్తుగా ప్రణాళిక రూపొందించి ట్రాప్ ఏర్పా టు చేశారు. ఈ క్రమంలో ఆంజనేయులు రూ.35 వేల లంచం అందజేస్తుండగా సం తోష్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అతని వద్ద నుంచి లంచం మొత్తా న్ని స్వాధీనం చేసుకున్నారు. సంతోష్‌పై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అవినీతికి పా ల్పడిన ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు హెచ్చరించారు.