calender_icon.png 7 December, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యామండలితో ఆస్ట్రేలియా వర్సిటీ భేటీ

07-12-2025 12:26:17 AM

‘ఎర్త్ సైన్సెస్’పై చర్చించిన ప్రొఫెసర్లు బాలకిష్టారెడ్డి, మోహన్

హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రా ంతి): తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డితో ఆస్ట్రేలియా మోనాశ్ యూనివర్సిటీ ఎన్విరాన్ మెంటల్ ఇంజినీరింగ్ విభాగం, క్రిటికల్ మినరల్స్ కన్సార్టియం సహ వ్యవస్థాపకుడు, ప్రొఫెసర్ మోహన్ యెల్లిశెట్టి శనివారం స మావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల కొత్తగూ డెంలో స్థాపించిన డాక్టర్ మ న్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అభివృద్ధికి సంబ ంధించి పలు అంశాలపై వా రు చర్చించారు.

విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేలా నూతన కోర్సుల రూపకల్పన, ఇం డస్ట్రీ, అకాడమిక్, పరిశోధనలకు టాస్క్ ఫో ర్స్ ఏర్పాటుపై, మైనింగ్, ఖనిజాల పరిశోధనలపై ఇరువురు చర్చించారు. ఆస్ట్రేలియా  మైనింగ్, పరికరాలకు ప్రసిద్ధి చెందిందని ప్రొ.మోహన్ తెలి పారు. రాష్ట్రంలోని ఎర్త్ సైన్సెస్ వర్సిటీకు తనవంతు సహాయ, సహకారాలు, తోడ్పా టు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు  పేర్కొన్నారు. ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు.