calender_icon.png 7 December, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మహత్యలు వద్దు

07-12-2025 12:23:10 AM

సాయి ఈశ్వరాచారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్

హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మార్పణ చేసుకున్న సాయి ఈశ్వర్ చారి కుంటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ తెలిపారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉం దని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హనుమంతరావు ఇతర నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మహే ష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ కోసం పోరాడుతారని, రాబోయే రోజు ల్లో బీసీలదే రాజ్యాధికారం అని అన్నారు. వీ హనుమంతరావు మాట్లాడుతూ కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమని, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది ఖాయమని, బీసీ రిజర్వేషన్లు సాధించుకుందామని తెలిపారు. బీసీ బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి పార్లమెంటులో బిల్లు ఆమోదిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. అది రాహు ల్ గాంధీ వల్లే సాధ్యమవుతుందన్నారు.