calender_icon.png 11 January, 2026 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాటు రుచుల ఎల్లిపాయకారం ఎక్స్‌ప్రెస్

09-01-2026 12:00:00 AM

నానక్‌రామ్‌గూడలో ఫుడ్ అవుట్‌లెట్ ప్రారంభం

హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో బుధవారం ‘ఎల్లిపాయకారం ఎక్స్‌ప్రెస్’ నూతన ఫుడ్ అవుట్‌లెట్‌ను మసుదా సినిమా ఫేమ్ నటి బంధవి శ్రీధర్, ఐఫా అవార్డు విజేత, సంగీత దర్శకుడు కళ్యాణ్ నాయక్, బిగ్‌బాస్ 9 ఫైనలిస్ట్ డెమోన్ పవన్, మిస్ ఇండియా తెలంగాణ 2023 ఊర్మిళ చౌహాన్ ప్రారంభించారు. సంప్రదాయ రుచులతో పాటు ఆధునిక శైలిలో తయారు చేసే వివిధ రకాల ప్రత్యేక వంటకాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఫౌండర్స్ గంగా విరాజ్ కోట, సాయిశ్రీ తెలిపారు.

తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకమైన నాటురుచులను ఫాస్ట్ ఫుడ్ తరహాలో ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఎల్లిపాయకారం ఎక్స్‌ప్రెస్‌ను- సిద్ది వినాయక ఫుడ్, బేవరేజ్ కంపెనీ నుంచి ప్రారంభించినట్టు చెప్పారు. ఎల్లిపాయకారం, చికెన్ వేపుడు, ప్రాన్స్ ఘీ రోస్ట్, బిర్యానీ.. వంటి ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అన్ని రకాల ఈవెంట్స్ కి క్యాటరింగ్ సర్వీస్ కూడా అందిస్తామని తెలిపారు.