09-01-2026 12:00:00 AM
ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి) : కృత్రిమ మేథ సాంకేతికలో దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతు న్న నగరంగా హైదరాబాద్ పరుగులు పెడుతోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. గురువారం హైటెక్ సిటీలో ఎయిడెన్ ఏఐ ఇం జనీరింగ్ కేంద్రం విస్తరణ పనులను ప్రా రంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండేళ్లలో తమ ప్రభుత్వం అభి వృద్ధి చేసిన ఎకో సిస్టం వల్ల ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ప్రస్తుతం తెలంగాణ వైపు చూస్తున్నాయన్నారు.
ఎయిడెన్ ఏఐ లో ప్రస్తుతం 500 మంది నిపుణులు పనిచేస్తుండగా వచ్చే రెండేళ్లలో మరో 500 మంది ప్రతిభావంతులకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. న్యూజెర్సీ లోని ప్రిన్స్ టన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ కృత్రిమ మేథలో నూతన ఆవిష్కరణల ద్వారా ప్రత్యేక స్థానాన్ని సంపా దించుకుందని తెలిపారు.
ఏఐని విస్తృత కార్యకలాపాలకు అభివృద్ధి చేసే సంస్థలను తమ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందని శ్రీధర్ బాబు వివరించారు. కార్యక్రమంలో సంస్థ సీఈవో కిరణ్ వెంట్ర ప్రగడ, సీఓఓ శ్రీని కమిడి, కవితా మురళీ కృష్ణ పాల్గొన్నారు.