calender_icon.png 10 January, 2026 | 8:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాల విద్యార్థులకు ‘మెస్సీ సైన్స్’

09-01-2026 12:00:00 AM

అందించిన 16 ఏళ్ల అనూజ్ భాటియా

హైదరాబాద్, జనవరి8 (విజయక్రాంతి): గచ్చిబౌలి జడ్పీ హైస్కూల్ ప్రాంగ ణం గురువారం ఓపెన్-ఎయిర్ సైన్స్ ల్యాబ్‌గా మారిం ది. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన 16ఏళ్ల విద్యార్థి అనూజ్ భాటి యా స్థాపించిన విద్యార్థి ఆధ్వర్యంలోని ‘స్టె ప్’ (సైన్స్ త్రో ఎక్స్‌పర్‌మెంట్స్ అండ్ ప్రా జెక్ట్స్) ద్వారా 200 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్ర మాన్ని ఇష్వా ఫౌండేషన్ (హైనంటి సర్కార్ సహకారంతో) డా.కేవీరావు సైంటిఫిక్ సొసై టీ సంయుక్తంగా నిర్వహించాయి. సొసైటీకి చెందిన మొబైల్ సైన్స్ వ్యాన్‌ను పాఠశాల ప్రాంగణానికి తీసుకువచ్చి, విద్యార్థుల కు శాస్త్రవిద్యను అందించారు. 

అనూజ్ భాటి యా మాట్లాడుతూ.. “భారతదేశంలో శాస్త్రాన్ని ఎక్కువగా మెమొ రైజేషన్ ద్వారా నేర్పిస్తున్నారు. స్టెప్ ద్వారా బ్లాక్‌బోర్డ్‌కు బదులుగా ‘మెస్సీ సైన్స్‌ను తీసుకురావాలనుకున్నాను. ప్రయోగాలు చేయ డం, తప్పులు చేయడం, మళ్లీ ప్రయత్నించడం ద్వారానే నిజమైన నేర్చుకోవడం జరుగుతుంది’ అన్నారు. రెండు గంటల పాటు సాగి న ఈ కార్యక్రమంలో 9వ, 10వ తరగతుల విద్యార్థులు తక్కువ ఖర్చుతో రూపొందించిన అనేక ఇంటరాక్టివ్ స్టేషన్లను సందర్శించారు.