13-08-2025 08:52:07 PM
బోడుప్పల్ కమిషనర్ శైలజ..
మేడిపల్లి: నగరంలో రాబోయే 72 గంటలలో భారీ వర్షాలు, హెచ్చరికల దృష్ట్యా బుధవారం బోడుప్పల్ నగరపాలక కమీషనర్ ఎ. శైలజ(Municipal Commissioner Sailaja) ఆధ్వర్యములో పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, హెల్త్, హైడ్రా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం, ఈ సమావేశంలో నీటి ముంపు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ముందు జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించడం, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించడం, ప్రమాద ప్రాంతాలను గుర్తించడం, రక్షణ బృందాల సిద్ధం వంటి అంశాలపై సమావేశంలో చర్చించడం జరిగింది.
అదే విధంగా కార్యాలయములో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం, కంట్రోల్ రూమ్ నెంబర్:040-27215959 ను సంప్రదించాలని కమిషనర్ ఏ శైలజ తెలిపారు. ఇట్టి సమావేశములో మేడిపల్లి మండలం తహసీల్దార్ హసీనా, సీఐ గోవింద రెడ్డి,అసిస్టెంట్ ఇంజనీర్ పరమేష్, హెల్త్ డిపార్ట్మెంట్ మెడికల్ ఆఫీసర్ ప్రణీత్,హైడ్రా అధికారులు,అసిస్టెంట్ మునిసిపల్ కమీషనర్ శ్యామ్ సుందర్ రావు,మునిసిపల్ అధికారులు, వార్డ్ ఆఫీసర్స్,వార్డ్ సూపెరవైసర్స్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.