calender_icon.png 13 August, 2025 | 11:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి పాఠశాలలో మాదకద్రవ్యాలపై ప్రతిజ్ఞ

13-08-2025 09:33:31 PM

ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు సింగరేణి పాఠశాల(Singareni School)లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం బుధవారం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా డిజిఎం పర్సనల్, పాఠశాల కరస్పాండెంట్ అజ్మీర తుకారాం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, పిల్లల్ని ఇంటి దగ్గర కొంత సమయాన్ని ఆటకి ఎక్కువ సమయాన్ని చదువుకు కేటాయించాలని అలాగే పిల్లల పనితీరును తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని ఫోన్లకి దూరంగా ఉంచాలని అని పరీక్షా సమయాల్లో ఇంటిదగ్గర పిల్లలకు చదువుకునే వాతావరణ ఏర్పాటు చేయాలని తెలిపారు.

అలాగే ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు తమ సలహాలను అందించడం జరిగింది. ఉపాధ్యాయులు తల్లిదండ్రుల నుండి సలహాలు సూచనలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాదకద్రవ్యాల నిరోధించడం పై ఉపాధ్యాయులు తల్లిదండ్రులు,  విద్యార్థులు అందరూ కలిసి ప్రతిజ్ఞ చేసినారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ బి శ్రీనివాస్ రావు, విష్ణుప్రియ, ఏ శ్రీనివాసరావు, బి రవీందర్, జి ధనలక్ష్మి, ఉషారాణి విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.