13-08-2025 08:40:24 PM
గుర్తుతెలియని వ్యక్తులుగా అనుమానం..
మంగపేట (విజయక్రాంతి): మండలంలోని తిమ్మంపేట గ్రామపంచాయతీ పరిధిలో గల జెడ్పి పాఠశాల తరగతి గది తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన సంఘటన మంగళవారం రాత్రి తిమ్మంపేటలో చోటుచేసుకుంది. జెడ్పి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెనక సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాఠశాలలో గతవారం రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా విద్యార్థులకు ఉపయోగపడే సైన్స్ మెటీరియల్స్, కంప్యూటర్ లను పాఠశాలకు ఇవ్వడం జరిగింది. వాటిని అదే రోజు పాఠశాలలోనీ తరగతి గదిలోనే భద్రపరచి ప్రతిరోజు గదికి తాళాలు సరిగా ఉన్నాయో లేదా అని ప్రతిరోజు పరిశీలించిన తర్వాత సాయంత్రం పాఠశాలను ముగించుకొని ఇంటికి వెళ్లే వెళ్లేవరమని వారు వెల్లడించారు.
ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం కూడా పాఠశాలను ముగించుకొని ఇంటికి వెళ్లి మరల ఉదయం పాఠశాల సమయానికి వచ్చి చూసేసరికి తరగతి గది తాళాలు పగలగొట్టి ఉండటాన్ని చూసి ఆందోళన చెంది, వెంటనే గదిలోకి వెళ్లి చూడగా సైన్స్ మెటీరియల్స్ అంతా గదిలో చెల్లాచెదురుగా పడివేసి ఉన్నాయని ఇది అంతా దొంగల పనేనని గుర్తించి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు ఈ విషయంపై స్థానిక ఎస్సై టివిఆర్ సూరి పాఠశాలను సందర్శించి దొంగతనానికి ప్రయత్నించిన తీరును పరిశీలించారు.