calender_icon.png 13 August, 2025 | 11:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధర్మపురికి అభినందనలు

13-08-2025 09:02:50 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2025 కోసం జాతీయ స్వతంత్ర జ్యూరీ బుధవారం నిర్వహించిన ముఖాముఖిలో జిల్లా నుంచి ఆసిఫాబాద్ మండలం జన్కాపూర్ ఊన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు ధర్మపురి వేంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఇందులో  తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొన్న ఆరుగురు ఉపాధ్యాయుల్లో వేంకటేశ్వర్లు ఒకరు. రాష్ట్రం నుంచి 150 మంది దరఖాస్తు చేసుకోగా ఆరుగురిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వేంకటేశ్వర్లు పాఠశాల విద్యా ప్రగతిని, విద్యార్థుల ప్రగతిలో వినూత్న సేవలను వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ శాలువా, మెమొంటోతో సత్కరించి అభినందించారు. సంయుక్త సంచాలకులూ మదన్మోహన్, ఆర్ జే డీ విజయలక్ష్మీ పాల్గొన్నారు.