13-08-2025 09:34:18 PM
ఘట్ కేసర్: బుధవారం జరిగిన ఓ వివాహ వేడుకల్లో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ(Former Haryana Governor Bandaru Dattatreya), ఎంపీ ఈటెల రాజేందర్, పలువురు ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. పోచారం మున్సిపల్ ఇస్మాయిల్ ఖాన్ గూడకు చెందిన ఘట్ కేసర్ రైతు సేవ సహకార సంఘం మాజీ చైర్మన్, మాజీ సర్పంచ్ గొంగళ్ల స్వామి మనవడు గొంగళ్ళ మధుసూదన్ - ప్రజ్ఞ వివాహం అవుషాపూర్ రాక్ ఎంక్లేవ్ కన్వర్షన్ హాల్లో జరిగింది. ఈ వివాహ వేడుకల్లో పలువురు ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఈటెల రాజేందర్ లతో పాటు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, రైతు సొసైటీ చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి, జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, కాంగ్రేస్ మేడ్చల్ బీ బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, గిరిజన మోర్చా జాతీయ నాయకులు ననావత్ బిక్కు నాయక్, రాష్ట్ర నాయకులు కాలేరు రామోజీ, బిజెపి జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు విక్రంరెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, ననావత్ సురేష్ నాయక్, రైతు సొసైటీ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి, కుటుంబ సభ్యులు, మాజీ కౌన్సిలర్లు, బంధుమిత్రులు నూతన వధూవరులను ఆశీర్వదించిన వారిలో ఉన్నారు.