calender_icon.png 13 August, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

13-08-2025 08:54:44 PM

సీఐ రామకృష్ణ

భూత్పూర్: ఆరోగ్యానికి హాని కలిగించే మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి భవిష్యత్తుకు బాటలు వేసుకుందామని సీఐ రామకృష్ణ(CI Ramakrishna) అన్నారు. భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఐటిఐ కాలేజీలో మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా విద్యార్థులకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ... గంజాయి, గుట్కా, హెరైయిన్, మద్యం శరీరానికి, మానసిక స్థితికి మార్పులు తీసుకొచ్చే హానికరమైన రసాయన పదార్థాలని వీటికి దూరంగా ఉండాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. ఎవరైనా డ్రగ్స్, గంజాయి అమ్మిన, కొనుగోలు చేసిన వారి వివరాలను అధికారులకు తెలియజేయాలని ఆయన అన్నారు. యువకులు గంజాయి, డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో  ఎస్సై చంద్రశేఖర్ తో పాటు తదితరులు ఉన్నారు.