13-08-2025 08:43:02 PM
సిద్దిపేట క్రైమ్: వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన 21 కిలోల గంజాయిని కాల్చివేసినట్టు పోలీస్ కమిషనర్ బి.అనురాధ(Police Commissioner Anuradha) తెలిపారు. 2019, 2022 నుంచి 2025 వరకు నమోదైన 30 కేసుల్లో ఈ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. కమిషనర్ ఆధ్వర్యంలో గంజాయి డిస్ట్రయ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్మన్ కమిషనర్ అనురాధ, మెంబర్లు ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం చిన్నకోడూరు మండలంలోని మాచాపూర్ గ్రామ శివారులో ఉన్న ధర్మ అండ్ కంపెనీ బయో మెడికల్ వేస్టేజ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఇన్సులేటర్ సహాయంతో గంజాయిని కాల్చివేశారు. ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, ఎస్బి ఇన్స్పెక్టర్ మొగిలి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు పూర్ణచందర్, రాజేష్, టూటౌన్ ఎస్ఐ ఆసిఫ్, చిన్నకోడూరు ఎస్ఐ సైఫ్ అలీ, బెజ్జంకి ఎస్ఐ సౌజన్య, సిబ్బంది పాల్గొన్నారు.