13-08-2025 09:49:33 PM
దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి..
దేవరకద్ర: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి(MLA Madhusudhan Reddy) ప్రజలకు సూచించారు. భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా ప్రజలకు అందుబాటులో అధికారులు ఉండాలని ఆదేశించారు. ఊక చెట్టు వాగు, పెద్ద వాగుల వరద ప్రవాహం, ప్రస్తుత పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. సరళసాగర్ కు వరద పెరిగి ఆటోమేటిక్ సైఫన్లు తెరుచుకోవడంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. నేడు అర్ధరాత్రి రేపటికి పూర్తిస్థాయిలో కోయిల్ సాగర్ నిండి గేట్లు తెరిచే అవకాశం ఉన్నందున కోయిల్ సాగర్ పరిసర గ్రామాల ప్రజలు, అప్రమత్తంగా ఉండాలని సూచించి, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇండ్లలో నుండి బయటకు రాకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.