13-08-2025 08:50:04 PM
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) ఆదేశాల మేరకు బుధవారం 60వ డివిజన్ పరిధి వడ్డేపల్లిలో ఏ.ఈ నరేందర్ రాజు, కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్, మాజీ కార్పొరేటర్ ఎనుకొంటి నాగరాజు, డివిజన్ అధ్యక్షులు ఎనుకుంటి పున్నం చందర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు బుస్సా నవీన్ కుమార్ లు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులైన అలుగునూరి సుజాత ఇంటి నిర్మాణ భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల లబ్దిచేకూర్చేందుకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు. ఇండ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షలు లబ్దిదారుల అకౌంట్లలో జమచేస్తుందని అన్నారు. ఇండ్లు మంజూరు అయిన లబ్దిదారులు ఇండ్ల నిర్మాణం పనులను ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ హరినాథ్, బిల్ కలెక్టర్ అజయ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు జనగాం శ్రీనివాస్, మిడిదొడ్డి శేఖర్, మట్టపల్లి కమల్ కుమార్, పిట్ట శేషు, ఎండి సాజిత్, పిట్ట వంశీ, బిజెపి శ్రేణులు నాగపూర్ అశోక్, కటకం యాదగిరి, మట్టపల్లి రామ్ రాజ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.