13-08-2025 03:33:12 PM
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామంలో ఎస్సై మహేష్ సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్థులు సూచించారు. ఈ సందర్బంగా ఎస్సై మహేష్ మాట్లాడుతూ... గ్రామాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలు, అనుమానితులు, ప్రమాదలను అరికట్ట వచ్చన్నారు. ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, దంగతునాలు జరుగకుండా, అనర్తలకు దారితియ్యకుండా ఉపయోగ పడతాయాని అన్నారు.
నేరాలు జరుగకుండా, ఒకవేళ జరిగితే నేరస్థులను పట్టుకోవడానికి సహాయపడ్తాయన్నారు. ఈ మధ్యకాలంలో చైన్ స్నాచింక్ ఎక్కువ జరుగుతున్నందున నిందుతులను త్వరగా పట్టుకోవడానికి సహాయపడుతుందన్నారు. అలాగే సైబర్ నేరాలపై ప్రజలకు అవగహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ మోసగాళ్లు ఫోన్ చేసి మేము బ్యాంక్ నుండి మాట్లాడుతున్నాము మీకు ఓటీపీ వచ్చింది చెప్పాలని అంటారు.
ఒకవేళ ఓటీపీ చెప్పినట్లయితే మీ ఖాతా నుండి డబ్బులు పోయే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీ చెప్పకూడదు. యువత పట్ల తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలి. వారు మధ్యానికి, మాదకద్రవ్యలకి చెడు వ్యాసనాలకి బనిసై జీవితం నాశనం చేసుకుంటారు కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు ఫోన్లను చెక్ చేస్తూ ఉండాలన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలంలోని సీసీ టీవీ పుటజెని ఎస్సై మహేష్ పరిశీలించారు.