calender_icon.png 8 December, 2025 | 11:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం తరలిస్తున్న ఆటో సీజ్

08-12-2025 10:24:00 PM

సిద్దిపేట క్రైం: మద్యం తరలిస్తున్న ఆటోను సీజ్ చేసినట్టు సిద్దిపేట టూటౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని వేములవాడ కమాన్ వద్ద  మధ్యాహ్నం వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఏపీ23యూ1371 నెంబర్ గల ఆటోలో బీర్లు, మద్యం క్వార్టర్ సీసాలు లభించాయని చెప్పారు. ఆటో డ్రైవర్ తాళ్లపల్లి శ్రీనివాస్ ను విచారించగా, కరీంనగర్ జిల్లా రేగులపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి జింగిలి లక్ష్మి అల్లుడు కుంభం శ్రీకాంత్ సూచన మేరకు సిద్దిపేట పట్టణంలోని కనకదుర్గ వైన్స్ నుంచి మద్యం కొనుగోలు చేసి తీసుకొని వెళుతున్నట్లు చెప్పాడని తెలిపారు. ఆటోను మద్యంతో సహా సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు ఇన్స్పెక్టర్ ఉపేందర్ తెలిపారు.