08-12-2025 10:00:17 PM
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లాలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ఆవరణలో ఈ నెల 9వ తేదీన తలపెట్టిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 10 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అధికారులు, అనధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.