calender_icon.png 8 December, 2025 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధానమంత్రి జీవన్ బీమా చెక్కు అందజేత

08-12-2025 10:25:34 PM

గరిడేపల్లి (విజయక్రాంతి): గరిడేపల్లి మండల పరిధిలోని సర్వారం గ్రామానికి చెందిన బీమపంగు శాంత, గుండాల సైదులు ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. వీరు గతంలో గరిడేపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు నందు 436 రూపాయలతో ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పాలసీ తీసుకున్నారు. దీంతో చనిపోయిన బాధితుల కుటుంబానికి ప్రధానమంత్రి జీవన్ బీమా నుంచి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు చొప్పున 4 లక్షలు బీమా సంస్థ మంజూరు చేసిందని తెలంగాణ గ్రామీణ బ్యాంకు గరిడేపల్లి బ్రాంచ్ మేనేజర్ కె .జనార్ధన్ తెలిపారు.  ఒక్కొక్కరికి  2 లక్షల రూపాయల ప్రధానమంత్రి జీవనబీమా చెక్కులను బాధితుల నామినీలు బీమపంగు మట్టయ్య,గుండాల మంగమ్మకు బ్యాంకు మేనేజర్ జనార్ధన్ అందించారు. కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ ఎల్.ఆనంద్, ఎ.రామాంజినేయులు,బ్యాంకు సిబ్బంది తో పాటు  హుజుర్నగర్ సిఎఫ్ఎల్ కౌన్సిలర్స్ బి.గోపి,పి.శ్రావణ్ కుమార్,కె.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.