calender_icon.png 25 May, 2025 | 11:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద ఉధృతికి వంతెన తెగి కొట్టుకుపోయిన ఆటో

25-05-2025 12:07:09 AM

-ప్రాణాలతో బయటపడ్డ ముగ్గురు ప్రయాణికులు

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే24( విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామానికి వెళ్లేదారిలో ఉన్న తాత్కాలిక వంతెనకు శుక్రవారం రాత్రి కురిసిన భారీ వ ర్షానికి గండి పడింది. అదే సమయంలో వంతెనపై నుంచి వెళ్తున్న ఆటో ప్రవాహం లో కొట్టుకుపోయింది.

వరద ఉధృతి లో ఆటో అదుపుతప్పటంతో అప్రమత్తమైన ప్ర యాణికులు, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఒడ్డుకు చేరుకున్నారు. అదృష్టవశాత్తు ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి ప్రాణపాయం తప్పడంతో కుటుంబ సభ్యు లు ఊపిరి పీల్చుకున్నారు. తరాలు గడిచినా గుండి బ్రిడ్జి నిర్మాణం పూర్తవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.