calender_icon.png 25 May, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేయాలి

25-05-2025 12:09:24 AM

-ఈడీ చార్జ్ షీట్‌లో పేరున్నందున అధిష్ఠానం ఆయన్ను తప్పించాలి

-బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును చార్జిషీట్లో ఈడీ చేర్చడం రాష్ట్రానికే అవమానకరమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నా రు. నైతికత, నీతి నిజాయితీ ఉంటే సీఎం పదవికి వెంటనే రాజీనామా చేయాలని డి మాండ్ చేశారు.

శనివారం హైదరాబాద్‌లోని తెలం గాణ భవన్‌లో నిర్వహించిన మీ డియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. చార్జి షీట్ తో ఈడీ ఆధారాలు చూపించిందని.. ఎవరు డబ్బులు ఇచ్చారు, ఏ పొ జిషన్‌ను అమ్ముకున్నారు, ఎన్ని డబ్బులు ఇ చ్చారు అన్న వివరాలను ఈడీ తన చార్జిషీ ట్లో స్ప ష్టంగా బయటపెట్టిందన్నారు.

రేవంత్ రెడ్డి మాటల ముఖ్యమంత్రి కాదు  మూటల సీఎం అని తేలిపోయిందని విమర్శించారు. ఓటుకు నోటు సమయంలో ఎ మ్మెల్యేగా ప రువు తీసిన రేవంత్ ఇప్పుడు రాష్ట్ర సీఎంగా తెలంగాణను మరింత కి ందకు దిగజార్చారని మండిపడ్డారు. విచ్చలవిడిగా స్కాంలు చేస్తున్న కాంగ్రెస్ ప్ర భుత్వాన్ని మోదీ ప్రభు త్వం ఎందుకు కాపాడుతుందో ప్రజలకు సమాధానం చెప్పాల న్నారు.

2020లో కర్ణాటక సీఎం యడ్యూర ప్ప హౌసింగ్ స్కామ్ లో ఉన్నట్టు వార్తలు వ స్తే నిష్పక్షపాతంగా విచారణ జరిగేందుకు రా జీనామా చేయాలని కర్ణాటక పీసీసీ అధ్యక్షు డు అప్పట్లో డిమాండ్ చేశారని గుర్తుచేశారు. 17 నెలల్లోనే 44 సార్లు హస్తినకు వెళ్లి సీఎం రేవంత్ అరుదైన రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు.

కే ంద్ర మంత్రులతో కలిసి తెలంగాణ బీజేపీ నే తలు చేస్తున్న అవినీతి కార్యకలాపాలకు రేవంత్ సపోర్ట్ చేస్తున్నందుకే మౌనం వహిస్తున్నారా అని ప్రశ్నించారు. సివిల్ సప్లు స్కామ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నది కేంద్రంలోని మోదీ ప్రభుత్వమేనన్నారు. 

హైదరాబా ద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందని సెంట్రల్ ఎంపవర్ కమిటీ స్పష్టంగా నివేదికలో చర్యలు తీసుకోవాలని సూచించినా ఇప్పటిదాకా కేంద్రం చర్యలు తీసుకోకోపోవడం ఇరుపార్టీల మధ్య అపరూప బంధానికి నిదర్శనమన్నారు. సివిల్ సప్లు స్కామ్ లో జరిగిన కుంభకోణాన్ని తాము ఆధారాలతో సహా బయటపెట్టామని గుర్తుచేశారు. సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ కవిత తదితరులు పాల్గొన్నారు.