08-12-2025 12:15:41 AM
గోపాలపేట, డిసెంబర్ 7: గోపాలపేట సర్పంచ్ అభ్యర్థి స్వప్న భాస్కర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని పట్టణ అధ్యక్షులు శివన్న ఘాటుగా సమాధానమిచ్చారు. ఆదివారం గోపాలపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తను చేసిన తప్పులకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటే అది మా పైన నెట్టడం సరికాదన్నారు.
కర్రోల్ల స్వప్న భాస్కర్ ఎన్నికల అఫిడవిట్లో తన భర్త ఏమి చేస్తారు ఉద్యోగం అనే కాలంలో ఏమి No అని తప్పుడు సమాచారం ఇచ్చింది ముందుగా తెలుసుకోవాలని చెప్పారు. ఈ విషయంపై కలెక్టర్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నా భర్త ఉద్యోగం నుండి సస్పెండ్ చేయించారని తప్పుడు కంప్లైంట్ ఎంతవరకు సమంజసం అని అన్నారు.
ఎన్నికల అప్డేట్ లో నా భర్త ఉద్యోగమే చేస్తలేడు అని చెప్పిన మీరు మరి ఎట్లా సస్పెండ్ చేసినట్లు తెలుసుకోవాలి.ఇంతకు ఉద్యోగం చేస్తున్నది నిజమా? ఎన్నికల్లో చెప్పింది నిజమా? ప్రజలే తెలుసుకోవాలి అని అన్నారు. ఎన్నికల అప్పుడు వీటిలో స్వప్న వృత్తి దగ్గర గృహిణి అని రాసింది. కానీ ఆమె గృహిణి కాదు ఐటి రిటరన్స్ ఫైల్ చేసిందన్నారు. ఐ టి ఆర్ త్రీ ఇది బిజినెస్ చేసే వాళ్లకు మాత్రమే వర్తిస్తుంది.
ఇది కూడా ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. కర్రోళ్ల భాస్కర్ ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది మాకు సంబంధం లేదు. అది వాళ్ళ ఉన్నత అధికారులు 27,28 తేదీలలో ఉద్యోగానికి హాజరు కాలేదు అనే కారణంతో సస్పెండ్ చేస్తున్నామని పత్రిక ప్రకటన ద్వారా హైదరాబాదులో తెలియజేశారు. కానీ అది మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
అది కూడా ఈరోజు కొత్త కాదు గతంలో చాలాసార్లు ఉద్యోగానికి హాజరుకానందువల్ల హెచ్చరించిన మార్పు రానందువలన సస్పెండ్ చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నాలు చేయకుండా ఉండాలని తెలిపారు. ప్రజలంతా వీరి ఆగడాలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సువర్ణ ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
విలేకరుల సమావేశంలో విలేకరుల సమావేశంలో సర్పంచ్ అభ్యర్థి సువర్ణ భర్త న్యాయవాది ఆంజనేయులు సర్పంచ్ అభ్యర్థి సువర్ణ భర్త న్యాయవాది ఆంజనేయులుఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సత్య శివారెడ్డి జోగు సంజీవ్ కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సత్య శివారెడ్డి జోగు సంజీవ్ కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.