5 March, 2026 | 4:32 AM

ముంచుకొస్తున్న గడువు!

05-03-2026 02:42 AM

డిమాండ్ రూ.13 కోట్ల 32లక్షలు..

వసూలైంది రూ.10 కోట్ల 56 లక్షలు

26 రోజుల్లో రూ.2కోట్ల 75 లక్షలు వసూళ్లు అయ్యేనా..?

మెదక్ జిల్లాలో 21 మండలాలు... 492 గ్రామ పంచాయతీలు..

ఒక్క పంచాయతీల్లో కూడా వంద శాతం పూర్తి కాలేదు..

మెదక్, మార్చి 4 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను వసూళ్లకు గడువు ముంచుకొస్తుంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో 26 రోజుల గడువు మాత్రమే ఉంది. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇ ప్పటి వరకు 70 శాతం వసూళ్ళు చేశారు. మెదక్ జిల్లాలో 21 మండలాలు ఉండగా 492 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. డి మాండ్ రూ.13.32 కోట్లు ఉండగా.. ఇప్పటి వరకూ రూ.10.56 కోట్లు వసూలు అయ్యిం ది. అంటే 70 శాతం మేర పన్ను వసూలు చేశారు.

మార్చి 31 వరకు లక్ష్యాన్ని పూర్తి చే యాలని కార్యదర్శులకు అధికారులు నిర్దేశించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయింది. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పంచాయతీ కార్యదర్శులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో పంచాయతీ కార్యదర్శులు ఇంటి పన్ను వ సూళ్లలో వెనకడుగు వేస్తున్నట్లు తెలిసింది. 

 ఎన్నికలు రావడంతో జీపిలు కళకళ... 

ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆస్తి పన్నుల వసూళ్లలో పంచాయతీల ఖజానా కళకళలాడింది. స ర్పంచులు, వార్డు సభ్యులతో పాటు బలపర్చిన వారికి సంబంధించిన ఆస్తి పన్నులు వ సూళ్లు అయ్యాయి. అయితే గ్రామాల్లో పన్ను ల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం, భారీ బకాయిదారులకు రెడ్ నోటీసులు ఇవ్వడంతో పాటు వసూళ్లను వేగవంతం చేసేలా అధికారులు నిత్యం సమీక్షిస్తున్నారు. టాక్స్ లు, నాన్ టాక్స్ ల కింద గ్రామ పంచాయతీల వారీగా లక్ష్యాలను విధించుకొని అభి వృద్ధి పనులకు నిధులు సమకూర్చుకుంటారు.

ప్రధానంగా ఇంటి పన్నులే కీలకం కాగా ఇళ్ల అనుమతులు, జరిమానాలు, బజార్ వేలం తదితర వాటి నుంచి వచ్చే ఆదాయం, వ్యాపార సముదాయాలకు విధించే జరిమానాలు, పన్నులు తదితర వాటి ద్వారా సమకూరే నిధులను నాన్ టాక్స్ ల కింద లెక్కిస్తారు. ఇంటి పన్నుల వసూళ్లలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నా నాన్ టాక్స్ ల వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వ్యాపారులతో లోపకారికం గా ఉంటూ వ్యాపార సముదాయాలకు పన్నుల విధింపు, వసూళ్లలో ఆసక్తి చూపడం లేదని ఆరోపణలు ఉన్నాయి.

 పంచాయతీల్లో అసెస్మెంట్ ఊసే లేదు..? 

గ్రామ పంచాయతీల్లో చాలా సంవత్సరాలుగా అసెస్మెంట్ చేయడం లేదు. గతంలో ఉన్న పన్నులు మాత్రమే వసూలు చేస్తున్నా రు. దీంతో పంచాయతీ ఖజానాకు గండి పడుతుంది. ఒక్కప్పుడు రేకులు, పెంకుటిల్లు ఇప్పుడు భవనాలుగా మారుతున్నాయి. అయినా పన్నుల డిమాండ్ పెరగడం లేదు. పాత ఇండ్లకు, కొత్తగా నిర్మించిన భవనాలకు ఎప్పటికప్పుడు అసెస్మెంట్ చేయకపోవడంతో పంచాయతీలకు ఆదాయం రాకుం డా పోతుంది.

ఒక్క జిపీల్లో కూడా వంద శాతం పూర్తి కాలేదు... 

మెదక్ జిల్లాలో 21మండలాల్లో 492 గ్రామ పంచాయతీ ఉన్నాయి. ఇందులో కొల్చారం మండలంలో 94 శాతం వసూళ్ళు కాగా, మాసాయిపేట 91, నర్సాపూర్ 90, హవేలీ ఘనపూర్ 89, రామా యం పేట 89, మెదక్ 86, తూప్రాన్ 85, పాపన్న పెట్, టెక్మాల్ 83 శాతం, వెల్దుర్తి, చిలిపిచేడ్, రేగోడ్ 81, మనోహరాబాద్ 79శాతం, చేగుంట, నార్సింగి, పెద్ద శంకరం పేట మండలాల్లో 77శాతం, నిజాం పెట్ 76, చిన్న శంకరం పేట, అల్లాదుర్గం, శివం పెట్, కౌడి పల్లి 71శాతం వసూళ్లు అయ్యాయి.

వంద శాతం పూర్తి చేస్తాం.. 

మెదక్ జిల్లాలో ఇంటి పన్ను వసూ ళ్ళు మార్చి 30వరకు పూర్తి చేస్తాం. పన్నుల వసూళ్లకు ప్రత్యేక కార్యాచరణ తో ముందుకు వెళ్తున్నాం. జిల్లాలో 492 గ్రామ పంచాయతీల్లో రూ.13.32 కోట్లు వసూళ్లు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకూ రూ. 10.56 కోట్లు వసూళ్లు అయ్యాయి.

యాదయ్య, డీపీఓ