17 April, 2026 | 2:38 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

సింగరేణిలో మునీర్ పేరిట పురస్కారాలు అందజేయాలి

16-06-2025 10:56 PM

రెవల్యూషన్ యూత్ ఆధ్వర్యంలో సింగరేణి సీఎండికి వినతిపత్రం..

మందమర్రి (విజయక్రాంతి): సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమ నేత దివంగత ఎండి మునీర్(MD Munir) విగ్రహాన్ని సింగరేణి ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో పాటు, సింగరేణిలో మునీర్ పేరిట పురస్కారాలు అందజేయాలని రెవల్యూషన్ స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షుడు, జర్నలిస్ట్ అనిల్ భగత్, ఉపాధ్యక్షుడు అక్బర్ లు కోరారు. ఈమేరకు హైదరాబాద్ లోని సింగరేణి భవనంలో సింగరేణి సిఎండి ఎం బలరాం నాయక్(Singareni CMD Balaram Naik)కు రివల్యూషన్ యువజన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సీనియర్ పాత్రికేయులు మునీర్ విగ్రహం ఏర్పాటు, అలాగే గని కార్మికులకు అందించే అవార్డులు మునీర్ పేరిట అందించాలనీ కోరారు. కోల్ బెల్ట్ లో సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాలతో నల్ల నేలలో నెలకొన్న సామాజిక సమస్యల పై అక్షర రూపం ఇస్తున్న జర్నలిస్టులకు మునీర్ పేరిట ఉత్తమ జర్నలిస్ట్ అవార్డులు ప్రతి సంవత్సరం అందించాలన్నారు. మునీర్ మృతి సమాజానికి తీరని లోటు అని ఆయన విగ్రహం ఏర్పాటు కోసం త్వరలో కమిటీ ని ఏర్పాటు చేస్తామన్నారు. బండ కింద బ్రతుకులకు బరోసా ఇచ్చిన జర్నలిస్ట్  మృతి నల్ల నేలకు తీరని లోటు అని, సింగరేణి చరిత్రలో ఆయన ప్రజల హృదయాల్లో సజీవంగా నిలిచి ఉంటారనీ ఆన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ప్రవీణ్, సాయి, దీపక్, జాఫర్ లు ఉన్నారు.