23 June, 2026 | 1:33 AM

పుట్టగొడుగుల సాగుపై అవగాహన

23-06-2026 12:36 AM

ఘట్ కేసర్, జూన్ 22 (విజయక్రాంతి) : అనురాగ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్లోని ప్లాంట్ పాథాలజీ విభాగం ఆధ్వర్యంలో పుట్టగొడుగుల సాగు ద్వారా వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధి అనే అంశంపై మూడు రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బోధనా సిబ్బంది, విద్యార్థులు పారిశ్రామికవేత్తలకు పుట్టగొడుగుల సాగు పద్ధతులు, వ్యాపార అవకాశాలు, పోషక, ఔషధ విలువలు, తెగుళ్ల గుర్తింపు నివారణ చర్యలు, కోత అనంతరం తీస్కోవాల్సిన జాగ్రత్తలు, ప్రాసెసింగ్ విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ వంటి అంశాలపై పుట్టగొడుగుల సాగులో అనుభవం కలిగిన శాస్త్ర వేత్తలు  పారిశ్రామికవేత్తలచే అవగాహన కలి ్పంచారు.

ఈ కార్యక్రమానికి వక్తలుగా వహించిన పుట్టగొడుగుల సాగులో నిపుణులు అయినటువంటి డాక్టర్  ఎం. పి. ఠాకూర్ (ప్రొఫెసర్, ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యా, రాయిపూర్ ) మాట్లాడుతూ పుట్టగొడుగుల సాగులో ఉన్న అవకాశాలను వివరిస్తూ, నాణ్యమైన పుట్టగొడుగుల స్పాన్ కు పెరుగుతున్న డిమాండ్ ను ప్రస్థావించారు. యువత స్పాన్ ఉత్పత్తి రంగాన్ని ఒక మంచి వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధి అవకాశంగా స్వీకరించాలని ప్రోత్సహించారు. ఈకార్యక్రమంలో డాక్టర్ విజయఖాదర్ డీన్, యువ పారిశ్రామికవేత్త ప్రీతి, డాక్టర్ పి. నారాయణ రెడ్డి (డీన్), డాక్టర్ కె. అరవింద్ (కన్వీనర్), జయంతి (కో కన్వీనర్), డాక్టర్ స్వాతి, డాక్టర్ రవి, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ దివాకర్ రెడ్డి, ఇతర బోధన సిబ్బంది పాల్గొన్నారు.